జిల్లా ఇంచార్జి మేడిపల్లి శ్యామ్ మాదిగ, అంబాల చంద్రమొగిలి మాదిగ చేతుల మీదుగా నియామకం
మలహర్, సెప్టెంబర్ 05 (చక్రవాణి న్యూస్) :
మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి (ఎమ్మార్పీఎస్ ) మల్హర్ మండల నూతన అధ్యక్షుడిగా ఇందారపు సిద్దు మాదిగ ఎన్నికయ్యారు. ఈనెల ఒకటిన జరిగిన కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా ఇంచార్జి మేడిపల్లి శ్యామ్ మాదిగ, అంబాల చంద్రమొగిలి మాదిగ, మండల ఇంచార్జి కేసరపు నరేష్ మాదిగ ఆధ్వర్యంలో ఇందారపు సిద్దు మాదిగను మల్హర్ మండల అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మండల అధ్యక్షుడు ఇందారపు సిద్దు మాదిగకు నాయకులు, కార్యకర్తలు అభినందనలు తెలిపారు. ఎమ్మార్పీఎస్ బలోపేతానికి, మాదిగల హక్కుల సాధన కోసం సమిష్టిగా పనిచేయాలని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
న్యూస్
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే
విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"



No comments:
Post a Comment