తాడిచర్ల లో చోటు చేసుకన్న విషాదం...
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న కొయ్యూరు ఎస్ఐ మహేందర్ కుమార్
మల్హర్ , జూలై 28 (చక్రవాణి న్యూస్) : మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలో మంగళవారం తెల్లవారుజామున పాము కాటుతో ఎండి రిజ్వాన్ (16) అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందిన విషాదకర సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. కొయ్యూరు ఎస్ఐ మహేందర్ కుమార్,తాడిచర్ల గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. మృతుడి తండ్రి అక్బర్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ భూపాలపల్లిలోని 100 పడకల ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఆయనకు తోడుగా భార్య కూడా ఆసుపత్రిలోనే ఉండటంతో, వారి కుమారుడైన విద్యార్థి రిజ్వాన్ రాత్రి ఇంట్లో ఒంటరిగా పడుకున్నాడు.ఈ క్రమంలో మంగళవారం తెల్లవారుజామున రిజ్వాన్ ప్రమాదవశాత్తు పాము కాటుకు గురయ్యాడు. గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు అత్యవసర చికిత్స నిమిత్తం బాలుడిని భూపాలపల్లి 100 పడకల ఆసుపత్రికి తరలించే క్రమంలో మార్గమధ్యలోనే ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి తండ్రి అక్బర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కొయ్యూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చేతికందివచ్చిన కొడుకు అకాల మరణం చెందడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.నిన్నటి వరకు తమ పాఠశాలలో చదివిన రిజ్వాన్ మరణంతో తోటి పదవ తరగతి స్నేహితులు కన్నీటి పర్యంతం అయ్యారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

0 Comments