మల్హర్ ఎంపిడిఓ క్రాంతి కుమార్
తాడిచర్ల మండల పరిషత్ కార్యాలయంలో జయంతి వేడుకలు
మల్హర్, సెప్టెంబర్ 09(చక్రవాణి న్యూస్) :
తెలంగాణ ప్రజల గొంతుకగా నిలిచిన ప్రముఖ కవి, ప్రజాకవి కాళోజి నారాయణరావు జయంతి వేడుకలను తాడిచర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎంపీడీఓ క్రాంతి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో కాళోజి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా కాళోజి నారాయణరావు సాహిత్య సేవలను, తెలంగాణ సమాజం పట్ల ఆయన కనబరిచిన నిబద్ధతను స్మరించుకున్నారు. ప్రజల సమస్యలను తన రచనల ద్వారా వెలుగులోకి తెచ్చిన కాళోజి ఆశయాలను నేటి తరం స్ఫూర్తిగా తీసుకోవాలని పేర్కొన్నారు.కార్యక్రమంలో ఎంపీఓ మల్లికార్జున్ రెడ్డి, ఏపీఓ గిరి హరీష్‌తో పాటు మండల పరిషత్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
చక్రవాణి
న్యూస్
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే
విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"
●
అన్యాయంపై అక్షర సమరం..
అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews |
#అవినీతిపై_సుదర్శన_చక్రం |
#అన్యాయంపై_విష్ణుచక్రం |
#నిజం_వైపు_చక్రవాణి

0 Comments