దేవుడు కాపాడాడంటున్న పోస్టర్.. తల్లిదండ్రుల నిర్లక్ష్యమే కారణమంటున్న జనం!
హైదరబాద్ , సెప్టెంబర్ 5 (చక్రవాణి న్యూస్) : సోషల్ మీడియాలో రోజుకు ఎన్నో రకాల వీడియోలు వైరల్ అవుతుంటాయి. కానీ, కొన్ని వీడియోలు చూసినప్పుడు ఒళ్లు గగుర్పాటుకు గురవుతుంది. తాజాగా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా అలాంటి ఒక హృదయ విదారక, షాకింగ్ వీడియో వైరల్‌గా మారింది. ఒక చిన్నారి తృటిలో ఘోర ప్రమాదం నుండి, బస్సు కింద పడకుండా ప్రాణాలతో బయటపడినట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.ఈ వీడియోను నెట్టింట షేర్ చేసిన ఒక యూజర్.. "ఎవరినైతే భగవంతుడు స్వయంగా రక్షిస్తాడో, వారిని ఎవరూ ఏమీ చేయలేరు" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే ఈ వీడియోపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. దేవుడు కాపాడాడనే మాట వాస్తవమే అయినా, అసలు అంత చిన్న పాప రోడ్డుపైకి వచ్చే వరకు తల్లిదండ్రులు ఏం చేస్తున్నారని నెటిజన్లు తీవ్రంగా మండిపడుతున్నారు."తల్లిదండ్రుల నిర్లక్ష్యాన్ని కప్పిపుచ్చడానికి దేవుడి పేరు వాడుకోవద్దు", "ఒకవేళ ఆ పాపకు ఏదైనా జరిగి ఉంటే ఆ బస్సు డ్రైవర్ పరిస్థితి ఏంటి?" అంటూ కామెంట్ల రూపంలో నెటిజన్లు తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. చిన్న పిల్లలు ఉన్న తల్లిదండ్రులు ఎంత జాగ్రత్తగా ఉండాలో ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది.
जिसकी रक्षा स्वयं ईश्वर करते हैं, उसका कोई कुछ नहीं बिगाड़ सकता।।
— P.P.JOSHI (@PrincyJoshi2) September 5, 2026
వైరల్ అవుతున్న పూర్తి వీడియోను ఇక్కడ చూడండి:https://x.com
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

0 Comments