గణేష్ విగ్రహ ఏర్పాటుకు పోలీస్ ఇంటిమేషన్ తప్పనిసరి

ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసి ఇంటిమేషన్ సర్టిఫికెట్ పొందాలి

కొయ్యూరు ఎస్ఐ మహేందర్ కుమార్ 

మలహర్, సెప్టెంబర్ 9(చక్రవాణి న్యూస్) 

వినాయక చవితి సందర్భంగా గణేష్ విగ్రహాన్ని ప్రతిష్ఠించదలచిన నిర్వాహకులు తప్పనిసరిగా పోలీస్ ఇంటిమేషన్ కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని కొయ్యూరు ఎస్ఐ మహేందర్ కుమార్ ఒక ప్రకటనలో సూచించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వినాయక మండపం ఏర్పాటు చేసే ప్రదేశం, ప్రతిష్ఠాపన తేదీ, నిమజ్జనం తదితర వివరాలను దరఖాస్తులో నమోదు చేయాలని తెలిపారు.అదేవిధంగా నిర్వాహకుల పూర్తి వివరాలు, సంప్రదింపు మొబైల్ నంబర్‌ను తప్పనిసరిగా అందించాలని సూచించారు. పోలీస్ శాఖ సూచించే శాంతిభద్రతలు, ట్రాఫిక్‌తో పాటు ఇతర నిబంధనలను పాటించాలని, గణేష్ ఉత్సవ నిర్వాహకులు నిర్ణీత సమయంలో ఇంటిమేషన్ దరఖాస్తు సమర్పించుకోవాలని ఎస్ఐ కోరారు.
చక్రవాణి
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...

అన్యాయాన్ని అంతం చేసే

విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments