గ్రామ పంచాయతీ కార్యాలయాల తరహాలో శాశ్వత భవనాలు నిర్మించాలి
వీబీజీ-రామ్‌జీ పథకంలో పోస్టాఫీసులకూ చోటివ్వాలి
బ్యాంకింగ్ నుంచి ఆధార్ వరకు.. సేవలు మాత్రం విస్తృతం
ఖాళీగా ఉన్న ప్రభుత్వ భవనాలైనా కేటాయించాలంటున్న ప్రజలు
హైదరాబాద్ , సెప్టెంబర్ 10(చక్రవాణి న్యూస్ ప్రతినిధి) :
గ్రామీణ ప్రాంతాల సర్వతోముఖాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోంది. ముఖ్యంగా ‘వీబీజీ-రామ్‌జీ’ (VB-G RAM G) పథకం ద్వారా గ్రామ పంచాయతీ కార్యాలయాలు, అంగన్‌వాడీ కేంద్రాలు, కమ్యూనిటీ హాళ్లు తదితర మౌలిక వసతుల నిర్మాణానికి ప్రాధాన్యం ఇస్తోంది. అయితే ప్రజలకు నిత్యం కీలక సేవలు అందిస్తున్న తపాలా శాఖకు మాత్రం అనేక ప్రాంతాల్లో సొంత భవనాలు లేకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో పోస్టాఫీసులకు కూడా పక్కా భవనాలు నిర్మించాలని ప్రజలు కోరుతున్నారు.
అద్దె భవనాల్లో అవస్థలు
గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని అనేక సబ్ పోస్టాఫీసులు, బ్రాంచ్ పోస్టాఫీసులు అద్దె భవనాల్లోనే కొనసాగుతున్నాయి. ఇరుకు గదుల్లో కార్యాలయాలు నిర్వహిస్తుండటంతో సిబ్బందితో పాటు ఖాతాదారులు ఇబ్బందులు పడుతున్నారు. కార్యాలయంలో కూర్చునేందుకు సరైన స్థలం లేకపోవడంతో వృద్ధులు, మహిళలు, పెన్షనర్లు గంటల తరబడి నిలబడాల్సి వస్తోంది. వర్షాకాలం, వేసవిలో పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారుతోంది.
సగం అద్దె భారం సిబ్బందిపైనే..
కొన్ని ప్రాంతాల్లో పోస్టాఫీసులకు ప్రభుత్వం నుంచి మంజూరయ్యే అద్దె సరిపోకపోవడంతో మిగిలిన మొత్తాన్ని సిబ్బందే భరించాల్సి వస్తోందని చెబుతున్నారు. శాశ్వత భవనాలు నిర్మిస్తే అద్దె భారం తగ్గడంతో పాటు కార్యాలయ నిర్వహణకు అనువైన వాతావరణం ఏర్పడుతుందని సిబ్బంది అభిప్రాయపడుతున్నారు.
సేవలు విస్తృతం.. వసతులు పరిమితం
ప్రస్తుతం పోస్టాఫీసులు ఉత్తరాల పంపిణీకే పరిమితం కాలేదు. ప్రజలకు బ్యాంకింగ్, పొదుపు, బీమా, డిజిటల్, పౌర సేవలను కూడా అందిస్తున్నాయి. సుకన్య సమృద్ధి యోజన, పీపీఎఫ్, ఆర్‌డీ, ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పాటు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఆధార్ ఆధారిత చెల్లింపులు, పెన్షన్ల పంపిణీ, డోర్‌స్టెప్ బ్యాంకింగ్ వంటి సేవలు అందుతున్నాయి.
ఆధార్.. పాస్‌పోర్ట్ సేవలు సైతం
ఆధార్ నమోదు, నవీకరణతో పాటు పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు, రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి సేవలు కూడా తపాలా శాఖ ద్వారా అందుబాటులో ఉన్నాయి. ఇన్ని రకాల ప్రజా ఉపయోగకరమైన సేవలు అందిస్తున్నప్పటికీ అనేక పోస్టాఫీసుల్లో కనీస మౌలిక వసతులు లేకపోవడం సేవల విస్తరణకు అడ్డంకిగా మారుతోంది.
ప్రభుత్వ భవనాలైనా కేటాయించాలి
గ్రామాల్లో ఖాళీగా ఉన్న పాత ప్రభుత్వ భవనాలను గుర్తించి వాటికి మరమ్మతులు చేపట్టి పోస్టాఫీసులకు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. కొత్త భవనాల నిర్మాణానికి అవకాశం ఉన్న చోట్ల వీబీజీ-రామ్‌జీ పథకం ద్వారా పోస్టాఫీసులకు కూడా పక్కా భవనాలు నిర్మించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో అద్దె భారం తగ్గడంతో పాటు సిబ్బందికి, ఖాతాదారులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని పేర్కొంటున్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:



No comments:
Post a Comment