తాడిచెర్ల ప్రజలకు గుడ్ న్యూస్.. సింగరేణికి 'తాడిచెర్ల-2' కోల్ బ్లాక్ కేటాయింపు!

రాబోయే 40 నుండి 50 ఏళ్ల పాటు బొగ్గు ఉత్పత్తి

స్థానికంగా పెరగనున్న ఉపాధి అవకాశాలు!"

మల్హర్. జూలై 7 (చక్రవాణి న్యూస్) : భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచెర్ల పరిధిలోని 'తాడిచెర్ల-2' కోల్ బ్లాక్‌ను సింగరేణి (SCCL) సంస్థకే కేటాయిస్తూ కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో జరిగిన ఉన్నత స్థాయి సమావేశంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ఈ కేటాయింపు ఫైలుపై అధికారికంగా సంతకం చేశారు.ఈ నిర్ణయం ద్వారా తాడిచెర్ల ప్రాంతంలో రాబోయే 40 నుండి 50 సంవత్సరాల పాటు నాణ్యమైన బొగ్గు ఉత్పత్తి జరగనుంది. తద్వారా స్థానిక ప్రాంత అభివృద్ధికి, సింగరేణి కార్మికుల భవిష్యత్తుకు భారీ లబ్ధి చేకూరనుంది. ఒడిశాలోని 'నైనీ' కోల్ బ్లాక్ అనుమతులతో పాటు మన తాడిచెర్ల బ్లాక్ కూడా సింగరేణి పరం కావడం పట్ల స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments