గిరిజన హామీలు అమలు చేయాలి..
చలో అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో ముందస్తు అరెస్టులు
మల్హర్ , సెప్టెంబర్ 11(చక్రవాణి న్యూస్) :
చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు, కార్యకర్తలను రాష్ట్రవ్యాప్తంగా ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని లంబాడి హక్కుల పోరాట సమితి రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర సమ్మయ్య నాయక్, భూపాలపల్లి జిల్లా లంబాడి యూత్ అధ్యక్షులు భానోత్ రాజేందర్ నాయక్ తెలిపారు శుక్రవారం కొయ్యూరు పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు దాటినా చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి సర్టిఫికెట్లు ఇప్పించాలని, గ్రామ పంచాయతీలకు పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారిక సెలవుదినంగా ప్రకటించి, జయంతి ఉత్సవాలకు రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణానికి 100 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన లంబాడి హక్కుల పోరాట సమితి, విద్యార్థి సంఘాల నాయకులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:
Post a Comment