మట్టి గణపతుల పంపిణీతో పర్యావరణ పరిరక్షణపై అవగాహన
భూపాలపల్లి , సెప్టెంబర్ 11(చక్రవాణి న్యూస్) : తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి (TGPCB), అటవీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ, అవగాహన కార్యక్రమాన్ని శుక్రవారం భూపాలపల్లి జిల్లా అటవీ కార్యాలయంలో నిర్వహించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా నోడల్ అధికారి, ఏఈఎస్ డాక్టర్ శ్రీకాంత్ ఆధ్వర్యంలో, జిల్లా అటవీ అధికారి శ్రీ జి. కిష్టా గౌడ్, IFS సమన్వయంతో కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా DFO శ్రీ జి. కిష్టా గౌడ్, IFS మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ పారిస్ (POP) విగ్రహాల వల్ల పర్యావరణానికి కలిగే నష్టాలను వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టి గణపతి విగ్రహాలను వినియోగించాలని సూచించారు.
అనంతరం ప్రజలు, అటవీ సిబ్బందికి సుమారు 400 మట్టి గణపతి విగ్రహాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో FDO శ్రీ అప్పలకొండ, భూపాలపల్లి FRO శ్రీమతి సృజన కుమారి, ఇతర అటవీ అధికారులు, TGPCB సిబ్బంది పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:


No comments:
Post a Comment