గిరిజనుల హామీలను అమలు చేయాలి
LHPS వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీరా సమ్మయ్య నాయక్...
భానోత్ రాజేందర్ నాయక్
మల్హర్, సెప్టెంబర్ 11(చక్రవాణి న్యూస్) :చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమం నేపథ్యంలో లంబాడి హక్కుల పోరాట సమితి నాయకులు, కార్యకర్తలను రాష్ట్రవ్యాప్తంగా ముందస్తుగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీర సమ్మయ్య నాయక్, భూపాలపల్లి జిల్లా యూత్ అధ్యక్షులు భానోత్ రాజేందర్ నాయక్ సంయుక్త ప్రకటనలో తెలిపారు. శుక్రవారం మలహర్ రావు మండలం కొయ్యుర్ పోలీసులు అరెస్టు చేసిన సందర్భంగా మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు దాటినా చేవెళ్ల ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్‌లో గిరిజనులకు ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం దురదృష్టకరమన్నారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేసి సర్టిఫికెట్లు ఇప్పించాలని, గ్రామ పంచాయతీలకు పెండింగ్ నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.సేవాలాల్ మహారాజ్ జయంతిని అధికారిక సెలవుదినంగా ప్రకటించాలని, జయంతి ఉత్సవాలకు రూ.100 కోట్లు కేటాయించాలని కోరారు. హైదరాబాద్ పరిసరాల్లో సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణానికి 100 ఎకరాల భూమి కేటాయించాలని డిమాండ్ చేశారు.రాష్ట్రవ్యాప్తంగా అరెస్టు చేసిన లంబాడి హక్కుల పోరాట సమితి, విద్యార్థి సంఘాల నాయకులను తక్షణమే బేషరతుగా విడుదల చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.

No comments:
Post a Comment