ఇద్దరికి పాజిటివ్.. NDPS యాక్ట్ కింద కేసులు
గ్రామాల్లో యువకుల వివరాల సేకరణ
యువత, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలి..... ఎస్ఐ మహేందర్ కుమార్
మల్హర్ , సెప్టెంబర్ 01(చక్రవాణి న్యూస్) :
మత్తు పదార్థాల వినియోగంపై కొయ్యూరు పోలీసులు ప్రత్యేక నిఘా చేపట్టారు. పెద్దతూండ్ల గ్రామానికి చెందిన ఇద్దరు యువకులకు రాపిడ్ టెస్ట్ కిట్ ద్వారా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. దీంతో వారిద్దరిపై NDPS యాక్ట్ కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పి. మహేందర్ కుమార్ తెలిపారు.
మండలంలోని వివిధ గ్రామాల్లో మత్తు పదార్థాలకు అలవాటైన యువకుల వివరాలను పోలీసులు సేకరిస్తున్నారని తెలిపారు. అనుమానం ఉన్న వారికి బీట్ కానిస్టేబుళ్ల వద్ద ఉన్న రాపిడ్ టెస్ట్ కిట్ల ద్వారా పరీక్షలు నిర్వహించి నిమిషాల్లో గుర్తించవచ్చన్నారు.
మత్తు పదార్థాలకు అలవాటైన యువకులు స్వచ్ఛందంగా పోలీసులను సంప్రదిస్తే డీ-అడిక్షన్ సెంటర్‌కు పంపించి వ్యసనం నుంచి బయటపడేలా సహకరిస్తామని ఎస్సై తెలిపారు. మత్తు పదార్థాలను విక్రయించే, రవాణా చేసే, కలిగి ఉన్న వారిపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. యువత భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు పోలీసులకు సహకరించాలని కోరారు.
auto;">
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:



No comments:
Post a Comment