Full width home advertisement

Post Page Advertisement [Top]


 భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ... శాఖల వారీగా అధికారులకు బాధ్యతలు

భూపాలపల్లి, సెప్టెంబర్ 11(చక్రవాణి న్యూస్) :జిల్లాలో ఈ నెల 23, 24 తేదీల్లో నిర్వహించనున్న వినాయక విగ్రహాల నిమజ్జనోత్సవాలను ప్రశాంత వాతావరణంలో, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ అధికారులను ఆదేశించారు. కాళేశ్వరం, ఘన్‌పూర్ తదితర ప్రధాన నిమజ్జన ప్రాంతాల్లో చేపట్టాల్సిన ఏర్పాట్లు, విధులపై వివిధ శాఖలకు బాధ్యతలు కేటాయిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.నిమజ్జన ప్రాంతాల్లో భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, విద్యుత్, తాగునీరు, పారిశుధ్యం, వైద్య సేవలు, అగ్నిమాపక, ఈతగాళ్ల సేవలు అందుబాటులో ఉండేలా ముందస్తు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సూచించారు. నిమజ్జన సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా పోలీసు శాఖ పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.ఈ నెల 23, 24 తేదీల్లో మహదేవ్‌పూర్, కాటారం మండలాల నుంచి ఇసుక రవాణా వాహనాల రాకపోకలను నిలిపివేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి వచ్చే వాహనాల రాకపోకలను క్రమబద్ధీకరించేందుకు అవసరమైన ట్రాఫిక్ నియంత్రణ చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు.కాళేశ్వరం, ఘన్‌పూర్ నిమజ్జన ప్రాంతాల్లో నిరంతర విద్యుత్, మైక్ సిస్టమ్, తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు కల్పించాలని పంచాయతీరాజ్, మున్సిపల్ అధికారులను ఆదేశించారు. నిమజ్జన రోజుల్లో నిరంతర విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు.మత్స్య, అగ్నిమాపక శాఖలు సమన్వయంతో నిపుణులైన ఈతగాళ్లను, ఫైర్ ఇంజన్లను నిమజ్జన ఘాట్ల వద్ద అందుబాటులో ఉంచాలని కలెక్టర్ ఆదేశించారు. కాళేశ్వరం, ఘన్‌పూర్‌తో పాటు కాటారం ప్రధాన జంక్షన్ వద్ద అంబులెన్స్‌లతో కూడిన వైద్య బృందాలను సిద్ధంగా ఉంచాలని వైద్యారోగ్య శాఖకు సూచించారు.విగ్రహాల నిమజ్జనానికి అవసరమైన మేరకు క్రేన్లు, జనరేటర్లు, డీజిల్ నిల్వలు, భద్రతా ఏర్పాట్లు చేయాలని నీటిపారుదల, సింగరేణి, జెన్‌కో అధికారులకు సూచించారు. విగ్రహాలను నిమజ్జన ప్రాంతాలకు తరలించే మార్గాల్లో గుంతలు లేకుండా పూడ్చాలని ఆర్‌అండ్‌బి అధికారులను ఆదేశించారు.నిమజ్జన కార్యక్రమం పూర్తయ్యే వరకు జిల్లాలోని వైన్‌షాపులు, బార్లు మూసివేసేలా ఎక్సైజ్ శాఖ చర్యలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు.నిమజ్జనోత్సవాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు వినాయక మండలి నిర్వాహకులు, భక్తులు, ప్రజలు అధికారులకు సహకరించాలని కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. నిమజ్జన సమయంలో ప్రతి ఒక్కరూ భద్రతా నిబంధనలు పాటిస్తూ పోలీసు, ఇతర శాఖల అధికారులు సూచించే మార్గదర్శకాలను అనుసరించాలని స్పష్టం చేశారు.

చక్రవాణి
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...

అన్యాయాన్ని అంతం చేసే

విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]