పాలిటెక్నిక్‌ల ప్రైవేటీకరణకు తావులేదు.. విద్యార్థుల భవిష్యత్తే ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ , సెప్టెంబర్ 12 (చక్రవాణి న్యూస్):
రాష్ట్ర విద్యా రంగంలో చేపడుతున్న సంస్కరణలు, పాలిటెక్నిక్ విద్యలో మార్పులు, ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపులపై ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి శాసనసభ వేదికగా స్పష్టత ఇచ్చారు. విద్యార్థుల్లో నెలకొన్న అనుమానాలు, అపోహలను నివృత్తి చేస్తూ విద్య, నైపుణ్యం, ఉపాధికి తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు.
పాలిటెక్నిక్ కళాశాలలను ప్రైవేటీకరించే ప్రసక్తే లేదని సీఎం స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ ఆధీనంలో ఉన్న పాలిటెక్నిక్‌లు ఇకపై కూడా ప్రభుత్వ ఆధీనంలోనే కొనసాగుతాయని తెలిపారు. సాంకేతిక విద్యను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకే వాటిని స్కిల్స్ యూనివర్సిటీ పరిధితో అనుసంధానం చేస్తున్నామని వివరించారు.
రాష్ట్రంలోని 59 పాలిటెక్నిక్ కళాశాలలను టాటా టెక్నాలజీస్ సహకారంతో రూ.4 వేల కోట్లతో ఆధునీకరిస్తున్నట్లు సీఎం వెల్లడించారు. ఏఐ, రోబోటిక్స్, సెమీకండక్టర్లు, ఎలక్ట్రిక్ వాహనాలు, అడ్వాన్స్‌డ్ మాన్యుఫ్యాక్చరింగ్ వంటి ఆధునిక రంగాలకు అనుగుణంగా కోర్సులను ఆధునీకరించి విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు తెలిపారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై మాట్లాడుతూ గత ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.5,435 కోట్ల బకాయిలు ఉన్నాయని సీఎం తెలిపారు. అందులో రూ.1,410 కోట్లను ఇప్పటికే చెల్లించామని, ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరో రూ.1,465 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు. మొత్తంగా 32 నెలల్లో ఫీజు రీయింబర్స్‌మెంట్ కోసం రూ.3,488 కోట్లు చెల్లించినట్లు తెలిపారు.
విద్యాశాఖకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను బడ్జెట్ కేటాయింపులు ప్రతిబింబిస్తున్నాయని సీఎం పేర్కొన్నారు. 2023-24లో రూ.19,093 కోట్లుగా ఉన్న విద్యాశాఖ బడ్జెట్‌ను 2026-27లో రూ.26,647 కోట్లకు పెంచామని, మూడేళ్లలో రూ.7,554 కోట్ల మేర పెంచినట్లు తెలిపారు.
తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఏడాదిలోనే 55 రోజుల్లో 10,006 మంది ఉపాధ్యాయుల నియామకాలు చేపట్టామని సీఎం వెల్లడించారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 86 వేల మేర పెరిగిందని తెలిపారు. ప్రీ-ప్రైమరీ విద్యను ప్రారంభించి ఈ ఏడాది 64 వేల మంది విద్యార్థులకు విద్య అందిస్తున్నామని చెప్పారు.
“దేశ భవిష్యత్తు తరగతి గదుల్లోనే ఉంది.. తలరాతలను మార్చేది విద్య” అనే నమ్మకంతో పనిచేస్తున్నామని సీఎం తెలిపారు. జెన్‌జీతో పాటు రానున్న జెన్‌ఆల్ఫా, జెన్‌బీటా తరాలను దృష్టిలో ఉంచుకుని నూతన విద్యా విధానాన్ని రూపొందిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణను విద్యా రంగంలో దేశానికి రోల్‌మోడల్‌గా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:
Post a Comment