Full width home advertisement

Post Page Advertisement [Top]


నర్సంపేట 'అపర భగీరథుడి' సేవలను స్మరించుకున్న ఉద్యమకారులు. 

 డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో తరలివచ్చిన టీయూఎఫ్ శ్రేణులు

నల్లబెల్లి, ఆగస్టు 04 (చక్రవాణి న్యూస్) : తెలంగాణ ఉద్యమ ఆణిముత్యం, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి చిత్రపటానికి టీయూఎఫ్ (TUF) ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఘనంగా నివాళులర్పించారు. నల్లబెల్లి మండల కేంద్రంలో జరిగిన పెద్ది 5వ రోజు సంతాప కార్యక్రమానికి ఎనిమిది జిల్లాల నుంచి సుమారు 400 మందికి పైగా ఉద్యమకారులు కదలివచ్చారు.ఈ సందర్భంగా టీయూఎఫ్ ఫోరం వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ మాట్లాడుతూ.. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అలసట ఎరుగక పోరాడిన సుదర్శన్‌రెడ్డి, తెలంగాణ ఉద్యమ చరిత్రలో చెరగని ముద్ర వేసుకున్నారన్నారు. నర్సంపేట పట్టణానికి మెడికల్ కాలేజీని తీసుకురావడమే కాకుండా, రాంపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా దేవాదుల జలాలను రంగయ్య చెరువు, మాదన్నపేట చెరువు, పాకాల సరస్సుకు మళ్లించి ఈ ప్రాంత రైతాంగానికి 'అపర భగీరథుడిలా' మారారని కొనియాడారు. ప్రజా సంక్షేమమే ధ్యేయంగా బతికిన ఆయన.. ప్రజలకు దూరం కావడం తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు.అనంతరం పెద్ది సుదర్శన్‌రెడ్డి సతీమణి స్వప్న, కుమారుడు నిధర్షన్ రెడ్డిలను నాయకులు పరామర్శించి, తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ ధైర్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆకుల సాంబరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ నందగిరి రజినీకాంత్, మహిళా అధ్యక్షురాలు పోతు జ్యోతి రెడ్డి, వరంగల్ జిల్లా అధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు, ఉమ్మడి వరంగల్ జిల్లా మహిళా అధ్యక్షురాలు కందికట్ల జయతో పాటు పలు జిల్లాల అధ్యక్షులు, ఉద్యమకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]