Full width home advertisement

Post Page Advertisement [Top]

బాధితులకు సత్వర న్యాయం అందించాలి: డీఎస్పీ సూర్యనారాయణ

మల్హర్ , ఆగస్టు 05 (చక్రవాణి న్యూస్) : స్టేషన్‌కు వచ్చే బాధితుల సమస్యలను ఓపికగా విని, వారికి సత్వర న్యాయం అందించడమే పోలీసుల ప్రథమ కర్తవ్యమని కాటారం డీఎస్పీ సూర్యనారాయణ స్పష్టం చేశారు. బుధవారం మండలంలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్‌లో కాటారం సీఐ నాగార్జున రావుతో కలిసి ఆయన వార్షిక తనిఖీలు నిర్వహించారు. పోలీస్ స్టేషన్ భవన సదుపాయాలు, సిబ్బంది హాజరు, ఆన్‌లైన్ రికార్డుల నిర్వహణను కూలంకషంగా పరిశీలించిన ఉన్నతాధికారులు. రికార్డుల నిర్వహణలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎస్ఐ మహేందర్ కుమార్‌కు పలు సూచనలు చేశారు. సివిల్ మరియు టీజీఎస్పీ సిబ్బందితో డీఎస్పీ ప్రత్యేక సమావేశం నిర్వహించి శాంతిభద్రతల పరిరక్షణలో ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేస్తూ, విధుల్లో పూర్తి స్పష్టత కలిగి ఉండాలని ఆదేశించారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ నమ్మకాన్ని పెంపొందించాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో కొయ్యూరు ఎస్ఐ మహేందర్ కుమార్‌తో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.





ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]