Full width home advertisement

Post Page Advertisement [Top]

చిన్నతూండ్ల సర్పంచ్‌ గడ్డం క్రాంతి.... గ్రామ ప్రజలకు ఉచితంగా మొక్కల పంపిణీ

మల్హర్ , ఆగస్టు 04 (చక్రవాణి న్యూస్) : పర్యావరణ సమతుల్యతను కాపాడటానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా మొక్కలు నాటి, వాటిని సంరక్షించాలని చిన్నతూండ్ల గ్రామ సర్పంచ్‌ గడ్డం క్రాంతి రణదేవ్ పిలుపునిచ్చారు. మల్హర్ రావు మండలంలోని చిన్నతూoడ్ల గ్రామంలో వనమహోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉచిత మొక్కల పంపిణీ కార్యక్రమం చేపట్టారు.ఈ కార్యక్రమానికి సర్పంచ్ గడ్డం క్రాంతి రణదేవ్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామ ప్రజలకు మొక్కలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. చెట్లు మానవాళి మనుగడకు ప్రాణాధారమని, ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలలో మొక్కలు నాటడమే కాకుండా, అవి వృక్షాలుగా మారే వరకు సంరక్షించే బాధ్యతను కూడా తీసుకోవాలని కోరారు. వర్షాకాలాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాన్ని పచ్చదనంతో నింపాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ ఉప సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఫీల్డ్ అసిస్టెంట్, వార్డు సభ్యులు, యూత్ అధ్యక్షులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]