Full width home advertisement

Post Page Advertisement [Top]

ముదిరాజ్ సామాజిక వర్గం ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరణ 

 హజరైన ముదిరాజ్ మహాసభ జిల్లా యువత అధ్యక్షుడు ముద్రవేని సురేష్ 

 మల్హర్ మండల ప్రదాన కార్యదర్శి చొప్పరి రాజు

మల్హర్ , ఆగస్టు 15 (చక్రవాణి న్యూస్) : మండల కేంద్రమైన తాడిచర్ల హనుమాన్ జంక్షన్‌లో ముదిరాజ్ కుల సంఘం ఆధ్వర్యంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముదిరాజ్ మహాసభ జిల్లా యువత అధ్యక్షుడు ముద్రవేని సురేష్, మండల ప్రధాన కార్యదర్శి చొప్పరి రాజు ముఖ్య అతిథులుగా హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహనీయుల త్యాగాలను స్మరిస్తూ, సమాజ అభివృద్ధిలో యువత భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ముదిిరాజ్ సామాజిక వర్గ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొని జాతీయ గీతాన్ని ఆలపించారు. అనంతరం అందరికీ మిఠాయిలు పంపిణీ చేశారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]