జిల్లా కలెక్టరేట్‌లో ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే, ఎస్పీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక పురస్కారం అందుకున్న ఎస్ఐ
మల్హర్ , ఆగస్టు 15 (చక్రవాణి న్యూస్) :
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ కార్యాలయంలో
శనివారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకల సందర్భంగా విధి నిర్వహణలో అత్యంత క్లిష్టమైన సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కొని, విశేష ప్రతిభ కనబరిచిన కొయ్యూరు పోలీస్ స్టేషన్ సబ్ ఇన్‌స్పెక్టర్ (ఎస్ఐ) మహేందర్ కుమార్‌ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ "కఠిన సేవా పతకం" పురస్కారానికి ఎంపిక చేశారు.ముఖ్య అతిథిగా హాజరైన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి, స్థానిక భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, జిల్లా ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్, ఐపీఎస్ గార్ల చేతుల మీదుగా ఎస్ఐ మహేందర్ కుమార్ ఈ ప్రతిష్టాత్మక పతకాన్ని, ప్రశంసా పత్రాన్ని అందుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో మెరుగైన సేవలు అందించినందుకు గానూ జిల్లా స్థాయి ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధుల సమక్షంలో ఆయనను ఘనంగా సత్కరించారు. ఈ పురస్కారం అందుకోవడం పట్ల పలువురు ప్రజాప్రతినిధులు, పోలీస్ సిబ్బంది ఎస్ఐ మహేందర్ కుమార్‌కు అభినందనలు తెలిపారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం



0 Comments