గుర్తింపు ప్రక్రియలో జాప్యం లేకుండా పూర్తి చేయాలని ఆదేశం
మల్హర్ , ఆగస్టు 29 (చక్రవాణి న్యూస్):
తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ చైర్మన్ కే. కేశవరావు నేతృత్వంలోని కమిటీ ప్రతినిధి బృందం శుక్రవారం హైదరాబాద్‌లో సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమానికి సంబంధించిన అంశాలపై చర్చించింది. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ ప్రొఫెసర్ ఎం.కోదండరామ్, కమిటీ ఎగ్జిక్యూటివ్ సభ్యుడు మోతే శోభన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రాములునాయక్ పాల్గొన్నారు. ఇటీవల హైదరాబాద్‌లోని అమరవీరుల స్మారక చిహ్నం (అమరదీపం) వేదికగా నిర్వహించిన విస్తృతస్థాయి సమావేశ వివరాలను కమిటీ ప్రతినిధులు సీఎంకు వివరించారు.
ఈ సమావేశంలో 13 వేల మందికి పైగా తెలంగాణ ఉద్యమకారులతో పాటు వివిధ జేఏసీలు, ప్రజాసంఘాలు, కవులు, కళాకారులు, మహిళా ఉద్యమకారులు పాల్గొన్నట్లు కమిటీ తెలిపింది. ఉద్యమకారుల నుంచి సేకరించిన అభిప్రాయాలు, విజ్ఞప్తులతో పాటు ఉద్యమకారుల వర్గీకరణకు సంబంధించిన సూచనలను ముఖ్యమంత్రికి సమర్పించింది. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఉద్యమకారులు చేసిన త్యాగాలను గుర్తించి, వారి సేవలకు తగిన గౌరవం కల్పించాల్సిన అవసరం ఉందని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఉద్యమకారులు చేసిన త్యాగాలను గుర్తిస్తూ వారికి తగిన గౌరవం కల్పించాలని, వారి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం తెలిపారు. ఉద్యమకారుల గుర్తింపు, సంక్షేమానికి సంబంధించిన కసరత్తును ఎలాంటి జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:


No comments:
Post a Comment