కొయ్యూరులో ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రం ప్రారంభం..
రైతులకు సత్వర సేవలు నాగులమ్మ–తాడిచెర్ల,
తాడిచెర్ల–ఖమ్మంపల్లి బ్రిడ్జి రోడ్లకు నిధులు
తాడిచెర్ల ఓసీపీ డేంజర్ జోన్ ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీకి రూ.261 కోట్లు: మంత్రి శ్రీధర్ బాబు
మల్హర్ , ఆగస్టు 30 (చక్రవాణి న్యూస్) : రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. మల్హర్ మండలంలోని కొయ్యూరులో పర్యటించిన మంత్రి విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రాన్ని, నూతన నయారా పెట్రోల్ బంక్‌ను ప్రారంభించారు.
గతంలో ఐదు మండలాలకు కాటారం కేంద్రంగా ఒకే ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రం ఉండటంతో మరమ్మతుల్లో జాప్యం జరిగి రైతులు ఇబ్బందులు పడేవారని మంత్రి తెలిపారు. ఈ సమస్యను దృష్టిలో ఉంచుకుని కొయ్యూరులో ప్రత్యేక ట్రాన్స్‌ఫార్మర్ మరమ్మతు కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
కొయ్యూరు నాగులమ్మ నుంచి తాడిచెర్ల వరకు, తాడిచెర్ల నుంచి ఖమ్మంపల్లి బ్రిడ్జి వరకు రహదారి నిర్మాణానికి హైబ్రిడ్ యాన్యుటీ మోడల్ కింద నిధులు మంజూరు చేశామని తెలిపారు. త్వరలోనే రహదారి నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
అలాగే మల్లారం ఎక్స్‌రోడ్ నుంచి పెద్దతూండ్ల వరకు, పెద్దతూండ్ల నుంచి చిన్నతూండ్ల మీదుగా మల్లారం వరకు రహదారి నిర్మాణానికి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని చెప్పారు.
తాడిచెర్ల గ్రామం టీజీ జెన్‌కో ఓపెన్‌కాస్ట్ డేంజర్ జోన్ పరిధిలో ఉన్నందున అక్కడి గృహాల సేకరణ, నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ కోసం రూ.261 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు. రెవెన్యూ యంత్రాంగం ప్రతి ఇంటినీ సర్వే చేస్తూ భూ నిర్వాసితులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
తాడిచెర్ల నుంచి భూపాలపల్లి పట్టణానికి రహదారి మార్గం ఏర్పాటు చేసిన విషయాన్ని మంత్రి గుర్తుచేశారు. మల్హర్ ప్రాంత ప్రజల సంక్షేమం, అభివృద్ధే తన ప్రధాన లక్ష్యమని పునరుద్ఘాటించారు.
అనంతరం కొయ్యూరులో నూతనంగా ఏర్పాటు చేసిన నయారా పెట్రోల్ బంక్‌ను మంత్రి ప్రారంభించారు. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని, నాణ్యమైన పెట్రోల్, డీజిల్‌ను సరఫరా చేయాలని సూచించారు. ఈ ప్రాంత రైతులకు అందుబాటులో ఉండేలా పెట్రోల్ బంక్ ఏర్పాటు చేసిన యజమాని సాయికృష్ణను మంత్రి అభినందించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్, రాష్ట్ర ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, ఈజీఎస్ చైర్మన్ దండు రమేష్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఐత రాజిరెడ్డి, జిల్లా గ్రంథాలయ చైర్మన్ కోట రాజబాబు, తాడిచెర్ల సింగిల్ విండో చైర్మన్ ఇప్ప మొండయ్య, మాజీ ఎంపీపీ మలహల్ రావు, ఎన్పీడీసీఎల్ కాటారం డీఈ నాగరాజు, స్థానిక సర్పంచ్ కొండ రాజమ్మతో పాటు వివిధ గ్రామాల సర్పంచులు, ప్రజాప్రతినిధులు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:




0 Comments