Full width home advertisement

Post Page Advertisement [Top]

పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపిన మహిళా కానిస్టేబుల్

మల్హర్ , ఆగష్టు 28(చక్రవాణి న్యూస్) : రాఖీ పండుగను పురస్కరించుకుని మల్హర్ మండలం కోయ్యూరు పోలీస్ స్టేషన్‌లో శుక్రవారం రాఖీ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా కానిస్టేబుల్ పోలీసు సిబ్బందికి రాఖీలు కట్టి రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్సై మహేందర్ కుమార్ మాట్లాడుతూ.. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమ, ఆప్యాయతలకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. పోలీసు సిబ్బంది విధి నిర్వహణలో ప్రజలకు భద్రత కల్పిస్తూ నిరంతరం సేవలందిస్తున్నారని తెలిపారు. సమాజంలో శాంతిభద్రతలను కాపాడుతూ ప్రజలకు నిరంతరం సేవలు అందించడం తమ బాధ్యత అని పేర్కొన్నారు. రాఖీ కట్టిన మహిళా కానిస్టేబుల్‌కు పోలీసు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం రాఖీ శుభాకాంక్షలు తెలుపుకుంటూ వేడుకలను ఆనందంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కోయ్యూరు పోలీస్ స్టేషన్ సిబ్బంది పాల్గొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]