Full width home advertisement

Post Page Advertisement [Top]


 ఎస్సీ కాలనీ, రామారావుపల్లె ఎంపీపీఎస్‌లలో ఘనంగా షూల పంపిణీ

ముఖ్యఅతిథిగా సర్పంచ్ బండి స్వామి

మల్హర్ (చక్రవాణి న్యూస్):మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని ఎస్సీ కాలనీ ఎంపీపీఎస్ పాఠశాల, రామారావుపల్లె ఎంపీపీఎస్ పాఠశాలల్లో ప్రజా ప్రభుత్వం విద్యార్థుల సంక్షేమం కోసం చేపట్టిన షూల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ బండి స్వామి ముఖ్యఅతిథిగా హాజరై పాఠశాల విద్యార్థులకు షూలను పంపిణీ చేశారు. కొత్త షూలను అందుకున్న చిన్నారులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా సర్పంచ్ బండి స్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల సంక్షేమం, వారి విద్యాభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందన్నారు. విద్యార్థులకు అవసరమైన సదుపాయాలు కల్పిస్తూ వారి బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం బాటలు వేస్తోందని తెలిపారు.ప్రభుత్వం అందిస్తున్న సదుపాయాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యలో రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థుల సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయురాళ్లు, ఉపాధ్యాయులు, పాఠశాల సిబ్బంది పాల్గొన్నారు.


చక్రవాణి
న్యూస్
ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం...

అన్యాయాన్ని అంతం చేసే

విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]