చేనులో పేలిన బాంబు.. గ్రామంలో కలకలం

పేలుడు ఘటనపై రంగంలోకి దిగిన పోలీసులు

భూపాలపల్లి, ఆగస్టు 22(చక్రవాణి న్యూస్) : కూలి పనికి వెళ్లిన మహిళకు చేనులో ఊహించని ప్రమాదం ఎదురైంది. మిరప చేనులో పనులు చేస్తుండగా భూమిలో ఉన్న అనుమానాస్పద వస్తువు ఒక్కసారిగా పేలడంతో మహిళా కూలీ గాయపడింది. భారీ శబ్దంతో పేలుడు సంభవించడంతో అక్కడ పనిచేస్తున్న కూలీలు భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పేలిన వస్తువు ఏ రకానికి చెందినది, చేనులోకి ఎలా చేరిందనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటనతో గ్రామంలో కలకలం రేగింది.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

Post a Comment

0 Comments