నాయి బ్రాహ్మణులపై దాడులను అరికట్టాలి

నాయిబ్రహ్మణ సేవాసంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయగిరి సమ్మయ్య 

 వృత్తి హక్కులను కాపాడేలా జీవో విడుదల చేయాలని డిమాండ్

మల్హర్ , ఆగష్టు 23(చక్రవాణి న్యూస్) : మా కులం, మా వృత్తి, మా హక్కు... వేరే కులస్థులు మా వృత్తిని చేపట్టకుండా ప్రభుత్వం వెంటనే జీవో విడుదల చేయాలి అని తెలంగాణ నాయి బ్రాహ్మణ సేవా సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు విజయగిరి సమ్మయ్య డిమాండ్ చేశారు. శనివారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండలం ఎడ్లపల్లి గ్రామంలో విలేకరుల సమావేశం నిర్వహించి మాట్లాడారు. ఇటీవల ఆదిలాబాద్ జిల్లాలో నాయి బ్రాహ్మణులపై జరిగిన దాడిని ఆయన తీవ్రంగా ఖండించారు. తరతరాలుగా గ్రామీణ ప్రాంతాలలో కులవృత్తినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నామని, తమ వృత్తి తమ జన్మహక్కు అని ఆయన స్పష్టం చేశారు. ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక నాయి బ్రాహ్మణ కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. నాయి బ్రాహ్మణుల కులవృత్తిని వేరే కులస్థులు చేయకుండా చట్టపరమైన రక్షణ కల్పిస్తూ ప్రభుత్వం వెంటనే రక్షణ జీవో జారీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. అలాగే ప్రతి జిల్లాలో నాయి బ్రాహ్మణులకు అధునాతన బ్యూటీ పార్లర్ ట్రైనింగ్ ఇప్పించి, ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షల ఆర్థిక సాయం మంజూరు చేయాలని కోరారు. గత ముఖ్యమంత్రి పదేళ్ల పరిపాలనలో నాయి బ్రాహ్మణులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయలేదని విమర్శిస్తూ, ప్రస్తుత గౌరవ ముఖ్యమంత్రి నాయి బ్రాహ్మణుల సమస్యలపై సానుకూల నిర్ణయం తీసుకుని ఆ హామీలను నెరవేర్చాలని విజ్ఞప్తి చేశారు. తమ హక్కులను కాపాడుకునేందుకు ప్రభుత్వం తక్షణమే స్పందించి, నాయి బ్రాహ్మణులకు న్యాయం చేయాలని విజయగిరి సమ్మయ్య కోరారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

Post a Comment

0 Comments