ప్రాజెక్టు హెడ్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో మొక్కలు నాటిన అధికారులు
మల్హర్ , ఆగస్టు 25 (చక్రవాణి న్యూస్) : మండల కేంద్రమైన తాడిచెర్ల కాపురం గ్రామంలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టు–1 పనులు నిర్వహిస్తున్న ఏఎంఆర్ కంపెనీ ఆధ్వర్యంలో మంగళవారం వనమహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఎంఆర్ కంపెనీ ప్రాజెక్టు హెడ్ ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో అధికారులు, సిబ్బంది, కార్మికులు మొక్కలు నాటారు.
పర్యావరణ పరిరక్షణలో భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో మొక్కల పెంపకం, పచ్చదనం పరిరక్షణ యొక్క ప్రాధాన్యతను వివరించారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటి సంరక్షణకు కృషి చేయాలని ఈ సందర్భంగా సూచించారు.
ఈ కార్యక్రమంలో సీసీఎఫ్ ప్రభాకర్, డీఎఫ్‌వో కృష్ణగౌడ్, ఎఫ్‌డీవో అప్పలకొండ, కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, అటవీ శాఖ అధికారులు, ఏఎంఆర్ కంపెనీ సేఫ్టీ మేనేజర్ సురేష్, తాడిచెర్ల సర్పంచ్ బండి స్వామి, ఏఎంఆర్ కంపెనీ అధికారులు, కార్మికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:




No comments:
Post a Comment