Full width home advertisement

Post Page Advertisement [Top]

అర్హులైన కొత్త ఓటర్లు నమోదు చేసుకోవాలని నాయకుల పిలుపు

మల్హర్ , ఆగస్టు 27(చక్రవాణి న్యూస్) : రుద్రారం గ్రామ పంచాయతీ కార్యాలయంలో సర్పంచ్ చంద్రగిరి సంపత్ ఆధ్వర్యంలో కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు గురువారం ప్రత్యేక సమగ్ర సవరణ (SIR-2026) ముసాయిదా ఓటరు జాబితా పరిశీలన గ్రామసభ నిర్వహించారు. గ్రామస్తులు, ప్రజాప్రతినిధులు ముసాయిదా ఓటరు జాబితాను పరిశీలించారు. అర్హులైన కొత్త ఓటర్లు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, ప్రతి ఒక్కరూ ఓటరు జాబితాలో తమ పేరు సరిచూసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు బట్టు కరుణాకర్, మల్హర్ రావు మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్, మాజీ మండల అధ్యక్షుడు బడితల రాజయ్య, వార్డు సభ్యులు చంద్రగిరి అశోక్, గాదె గట్టయ్య, గ్రామ పంచాయతీ సిబ్బంది, బీఎల్‌వోలు, బీఎల్‌ఏలు పాల్గొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!

#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]