బాధిత కుటుంబాలకు అండగా పుట్ట మధు

అంతిమయాత్రల్లో పాల్గొని నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్యే

మల్హర్ , ఆగస్టు 25(చక్రవాణి న్యూస్) : మండలంలోని చిన్నతూండ్ల గ్రామ మాజీ సర్పంచ్ పులిగంటి మమత నరసయ్య తండ్రి మల్లయ్య మృతి చెందడంతో మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. మల్లయ్య అంతిమయాత్రలో పాల్గొని మృతదేహంపై పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సానుభూతి తెలిపారు. అదేవిధంగా మల్లారం గ్రామానికి చెందిన వార్డు సభ్యుడు దేనవేన దేవేందర్ తండ్రి దేనవేన రాయమల్లు, గడ్డం పోచమ్మ మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులను కూడా మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ పరామర్శించారు. ఈ విషాద సమయంలో కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ గోనే శ్రీనివాస్ రావు, బీఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షుడు జాగరి హరీష్, ఉప సర్పంచులు పులిగంటి రాములు, అవిరినేని పురుషోత్తం రావు, వార్డు సభ్యులు కోట చంద్రమౌళి, భోగే సదానందం, నాయకులు మిరియాల పద్దు రావు, కూర సత్తయ్య, అజ్మీర దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!



#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

Post a Comment

0 Comments