Full width home advertisement

Post Page Advertisement [Top]


రాజీవ్ గాంధీ సేవలను స్మరించుకున్న మల్హర్ కాంగ్రెస్ శ్రేణులు 

 జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో చిత్రపటానికి పూలమాలలు

మల్హర్ , ఆగస్టు 20 (చక్రవాణి న్యూస్) : మల్హర్ రావు మండలం కొయ్యూరులో భారత మాజీ ప్రధానమంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ 82వ జయంతి వేడుకలను కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు జంగిడి శ్రీనివాస్ ఆధ్వర్యంలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. దేశ సాంకేతిక రంగ అభివృద్ధికి రాజీవ్ గాంధీ చేసిన సేవలను, యువతకు 18 ఏళ్లకే ఓటు హక్కు కల్పించడంలో ఆయన పాత్రను నాయకులు స్మరించుకున్నారు. కార్యక్రమంలో మల్హర్ మండల సర్పంచ్ ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ, పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య, మల్హర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు, చిన్నతూండ్ల సర్పంచ్ గడ్డం క్రాంతి, వల్లెంకుంట సర్పంచ్ బొమ్మ రజిత రమేష్ రెడ్డి, కొండంపేట సర్పంచ్ బెల్లంకొండ జ్యోత్స్న సరీన్ రావు, ఇప్పలపల్లె సర్పంచ్ అబ్బినేని లింగస్వామి, మల్లారం సర్పంచ్ మేకల రాజయ్య పాల్గొన్నారు. అలాగే మార్కెట్ కమిటీ డైరెక్టర్ గడ్డం పోచయ్య, వివిధ గ్రామాల ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, యూత్ నాయకులు, మహిళా నాయకురాళ్లు, కార్యకర్తలు పాల్గొని రాజీవ్ గాంధీకి ఘన నివాళులర్పించారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]