చిట్యాల ఘటనపై పోలీసుల చర్య.. మరో ఐదుగురి కోసం గాలింపు
భూపాలపల్లి, ఆగస్టు 20(చక్రవాణి న్యూస్) :
చిట్యాలకు చెందిన ఆర్బీ న్యూస్ రిపోర్టర్ రవితేజ పై దాడి చేసి ఇంటి సామగ్రిని ధ్వంసం చేసిన కేసులో నలుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి దాడికి ఉపయోగించిన కారును స్వాధీనం చేసుకుని, వారిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
భూమి వివాదానికి సంబంధించిన వార్తల నేపథ్యంలో రిపోర్టర్‌పై దాడి జరిగినట్లు పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. కేసులో పరారీలో ఉన్న మరో ఐదుగురు నిందితుల కోసం గాలింపు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని దాడులకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం

0 Comments