Full width home advertisement

Post Page Advertisement [Top]

సెప్టెంబర్‌ 1 నుంచి FFS ద్వారా బుకింగ్‌.. పంట వివరాలు నమోదు తప్పనిసరి 

మండల వ్యవసాయ అధికారిణి బొల్లపెల్లి శ్రీజ

మల్హర్ , ఆగస్టు 31 (చక్రవాణి న్యూస్) : రైతులకు ఎరువుల బుకింగ్‌ విషయంలో కొత్త విధానం అందుబాటులోకి రానుంది. సెప్టెంబర్‌ 1వ తేదీ నుంచి FFS యాప్‌ ద్వారా మాత్రమే ఎరువుల బుకింగ్‌ ప్రక్రియ చేపట్టనున్నట్లు మండల వ్యవసాయ అధికారిణి బొల్లపెల్లి శ్రీజ సోమవారం వెల్లడించారు. ఇందులో భాగంగా రైతులు ముందుగా ప్లేస్టోర్‌ నుంచి FFS యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని తమ పంట వివరాలను నమోదు చేసుకోవాలి. అనంతరం పంట అవసరాలకు అనుగుణంగా యూరియా, కాంప్లెక్స్‌ తదితర ఎరువులను యాప్‌లో బుక్‌ చేసుకుని పొందే అవకాశం ఉంటుంది. ఎరువుల పంపిణీలో పారదర్శకత, రైతులకు సులభతరమైన సేవలు అందించేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. రైతులందరూ ముందుగానే FFS యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని, పంట వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]