కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జంగిడి శ్రీనివాస్
మల్హర్, ఆగస్టు 28(చక్రవాణి న్యూస్)
:
మండల ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, అన్ని అనుబంధ సంఘాల నాయకులకు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు, ఎడ్లపల్లి సర్పంచ్ జంగిడి శ్రీనివాస్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాఖీ పండుగ అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల మధ్య ప్రేమానురాగాలు, ఆత్మీయతకు ప్రతీకగా నిలుస్తుందని అన్నారు. సోదరసోదరీమణుల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేసే పవిత్రమైన పండుగ రక్షాబంధన్ అని పేర్కొన్నారు. ప్రతి ఆడబిడ్డకు అండగా నిలవాలనే సందేశాన్ని రాఖీ పండుగ అందిస్తుందని తెలిపారు. మండల ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆనందంగా రాఖీ పండుగను జరుపుకోవాలని జంగిడి శ్రీనివాస్ ఆకాంక్షించారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:



0 Comments