Full width home advertisement

Post Page Advertisement [Top]

మల్హర్, ఆగస్టు 06 (చక్రవాణి న్యూస్) : మండల కేంద్రమైన తాడిచర్లలోని టీజీ జెన్కో ఓసిపి (OCP) బ్లాక్ వన్ పరిధిలో ఉత్కంఠ వాతావరణం నెలకొంది. 500 మీటర్ల డేంజర్ జోన్ పరిధిలోని నివాస గృహాలు, భూముల సేకరణ కోసం ప్రభుత్వం చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే గడువు నేటితో (శుక్రవారం) ముగియనుంది. అధికారికంగా ప్రకటించిన చివరి రోజు కావడంతో, సర్వే పూర్తి కాని వందలాది కుటుంబాల్లో తీవ్ర ఆందోళన మొదలైంది.డేంజర్ జోన్ పరిధిలో మొత్తం 2,265 గృహాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. గత పదిహేను రోజులుగా చేస్తున్న సర్వే లో గురువారం వరకు 1,728 ఇళ్లకు సర్వే పూర్తయినట్లు అధికారులు వెల్లడించారు. మిగిలిన 537 ఇళ్లకు సంబంధించిన సర్వే నేటి ఒక్కరోజే పూర్తి కావలసి ఉంది. మిగిలిన ఇళ్ల సర్వే పూర్తవుతుందా లేదా అని 500కు పైగా గృహాల నిర్వాసితుల్లో ఆందోళనల నెలకొంది. ప్రతి ఇంటిని తప్పకుండా సర్వే చేస్తామని తహసీల్దార్ రవికుమార్ తెలియజేశారు. అధికారులు, సర్వే బృందాలు ప్రతి ఇంటికి సర్వే నిర్వహించి న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]