ముర్రుపాలు శిశువుకు సహజ రక్షణ: సీడీపీఓ రాధికా రెడ్డి
మల్హర్ , ఆగస్టు 05 - చక్రవాణి న్యూస్) : మహాదేవ్‌పూర్ ప్రాజెక్టు పరిధిలోని తాడిచర్ల మండల కేంద్రంలో గల కమ్యూనిటీ హాల్‌లో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. స్థానిక సర్పంచ్ బండి స్వామి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీడీపీఓ శ్రీమతి ఇత రాధికా రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. పుట్టిన గంట లోపే శిశువుకు తల్లిపాలు పట్టించడం వల్ల జీవితాంతం ఆరోగ్యానికి బలమైన పునాది పడుతుందని స్పష్టం చేశారు. ప్రసవం తర్వాత వెంటనే వచ్చే ముర్రుపాలు శిశువుకు సహజసిద్ధమైన తొలి టీకా లాంటివని పేర్కొన్నారు. మొదటి ఆరు నెలల వయసు వరకు శిశువుకు తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, నీరు గానీ ఇతర ఆహార పదార్థాలు గానీ అస్సలు ఇవ్వకూడదని తల్లులకు సూచించారు. సర్పంచ్ బండి స్వామి మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న అంగన్‌వాడీ సేవలను గ్రామీణ ప్రాంతాల్లోని తల్లులు, గర్భిణులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం చిన్నారులకు అన్నప్రాసనలు, అక్షరాభ్యాస కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి, అంగన్‌వాడీ కార్యకర్తలు అరుణ, జయప్రద, లక్ష్మి, బాలమ్మ, హెల్పర్లు, ఆశా కార్యకర్తలు మరియు స్థానిక తల్లులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:




0 Comments