Full width home advertisement

Post Page Advertisement [Top]

అంగన్‌వాడీ సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి

 ముఖ్య అతిథిగా హాజరైన సర్పంచ్ మేకల రాజయ్య యాదవ్... ఉప సర్పంచ్ అవిర్నేని పురుషోత్తం రావు

మల్హర్ , ఆగస్టు 04 (చక్రవాణి న్యూస్) : మండలంలోని మల్లారం గ్రామంలో గల అంగన్‌వాడీ కేంద్రంలో మంగళవారం తల్లిపాల వారోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామ సర్పంచ్ మేకల రాజయ్య, ఉపసర్పంచ్ పురుషోత్తమరావు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా అంగన్‌వాడీ సూపర్‌వైజర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ.. శిశువు జన్మించిన గంటలోపే తల్లిపాలు పట్టించడం ఎంతో అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. పుట్టిన వెంటనే వచ్చే ముర్రుపాలు బిడ్డకు తొలి టీకాలా పనిచేసి, రోగ నిరోధక శక్తిని పెంచుతాయని వివరించారు. మొదటి ఆరు నెలల వరకు కేవలం తల్లిపాలు మాత్రమే ఇవ్వాలని, నీరు, తేనె వంటి ఇతర పదార్థాలు అస్సలు ఇవ్వకూడదని స్పష్టం చేశారు. ఆరు నెలల తర్వాత ఇంట్లో తయారు చేసిన పౌష్టికాహారాన్ని అలవాటు చేస్తూనే, రెండేళ్ల వయసు వచ్చే వరకు తల్లిపాలను కొనసాగించాలని తల్లులకు సూచించారు.ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు సుజాత, ప్రాథమిక పాఠశాల హెచ్ఎం తిరుపతి, ప్రైమరీ స్కూల్ ఉపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శి సాయి, అంగన్‌వాడీ టీచర్లు, గర్భిణులు, బాలింతలు, తల్లులు మరియు చిన్న పిల్లలు పాల్గొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]