సబ్ సెంటర్లలో పనితీరు మెరుగుపరచాలి

జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్

 తాడిచర్ల పీహెచ్‌సీ ఆకస్మిక తనిఖీ

మల్హర్ , ఆగస్టు 04 (చక్రవాణి న్యూస్) : మల్హర్ మండలం తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (PHC) జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు పట్టిక, రోగుల రిజిస్టర్లు, మందుల నిల్వలను నిశితంగా పరిశీలించారు. వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని సిబ్బందిని హెచ్చరించారు. 
 వనమహోత్సవంలో మొక్కలు నాటిన అధికారులు
తనిఖీ అనంతరం ఆరోగ్య కేంద్ర ఆవరణలో వనమహోత్సవం కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్యాధికారితో పాటు ఇతర వైద్య అధికారులు కలిసి ప్రాంగణంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 
 వైద్య సిబ్బందితో సమీక్ష సమావేశం 
ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఆశా కార్యకర్తల సమావేశంలో ఉప కేంద్రాల వారీగా ప్రగతిని సమీక్షించారు. గర్భిణీల నమోదు, ప్రసవాలు, దీర్ఘకాలిక వ్యాధుల గుర్తింపు, క్షయ (టీబీ) వ్యాధి నివారణపై చర్చించారు. తక్కువ ప్రగతి కనబరిచిన సబ్ సెంటర్ల సిబ్బంది తమ పనితీరును తక్షణమే మెరుగుపరుచుకోవాలని ఆదేశించారు. అన్ని ప్రాంతాల్లో ఉచిత వైద్య పరీక్షలు, క్షయ నిర్ధారణ శిబిరాలు నిర్వహించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు డాక్టర్ శ్రీదేవి, డాక్టర్ దేవేందర్, డాక్టర్ సందీప్, డాక్టర్ నాగరాణి, మధుబాబు, చిరంజీవి, తాడిచర్ల వైద్యాధికారి డాక్టర్ వినయ్ భాస్కర్ మరియు స్థానిక వైద్య సిబ్బంది పాల్గొన్నారు.


ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

Post a Comment

0 Comments