కొయ్యూరులో ఉచిత వైద్య శిబిరం

89 మందికి వైద్య పరీక్షలు... సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు కొండ రాజమ్మ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

మల్హర్ , ఆగస్టు 04 (చక్రవాణి న్యూస్) : కొయ్యూరు గ్రామ సర్పంచ్, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షురాలు కొండ రాజమ్మ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. తాడిచర్ల వైద్యాధికారి డాక్టర్ వినయ్ భాస్కర్ ఆదేశాల మేరకు వైద్య సిబ్బంది 89 మంది రోగులకు పరీక్షలు చేశారు.బాధితులకు బీపీ, షుగర్, డెంగ్యూ, మలేరియా, సికిల్ సెల్ పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేశారు. వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఎంఎల్‌హెచ్‌పీ డాక్టర్ సుజయ్ కిరణ్ అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి రాజు, హెల్త్ అసిస్టెంట్, ఏఎన్‌ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

Post a Comment

0 Comments