Full width home advertisement

Post Page Advertisement [Top]

మండల ప్రగతికి అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలి ప్రత్యేక అధికారి బాబూరావు, ఎంపీడీఓ క్రాంతి కుమార్ 

 మల్హర్ రావు మండల సర్వసభ్య సమావేశం

మల్హర్ , ఆగస్టు 05 (చక్రవాణి న్యూస్) : మండల సమగ్ర అభివృద్ధి, ప్రజా సమస్యల త్వరితగతిన పరిష్కారమే ధ్యేయంగా అధికారులు, ప్రజాప్రతినిధులు నిరంతరం సమన్వయంతో కృషి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి, మండల ప్రత్యేక అధికారి బాబూరావు, ఎంపీడీఓ క్రాంతికుమార్ పిలుపునిచ్చారు. బుధవారం మండల పరిషత్ కార్యాలయంలో ప్రత్యేక అధికారి బాపురావు అధ్యక్షతన మల్హర్ రావు మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయి సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని కోరారు. పీఏసీఎస్ చైర్మన్ ఇప్ప మొండయ్య మాట్లాడుతూ రైతులకు అవసరమైన అన్ని రకాల ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచుతామని స్పష్టం చేశారు. 
 సమీక్షలో వెల్లువెత్తిన సమస్యలు: 
 సమావేశంలో పలు గ్రామాల సర్పంచులు తమ పరిధిలోని సమస్యలను అధికారుల దృష్టికి తెచ్చారు. తాడిచర్ల సీఎస్ఆర్ నిధులను ఆ గ్రామ అభివృద్ధికి మాత్రమే కేటాయించాలని, అర్హులైన వారందరికీ కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయాలని తాడిచర్ల సర్పంచ్ బండి స్వామి కోరారు. మంథని - కొయ్యూరు వయా ఖమ్మంపల్లి మీదుగా ఆర్టీసీ బస్సు సర్వీసును పునరుద్ధరించాలని డీఎంకు విజ్ఞప్తి చేశారు. కొయ్యూరులో ప్రజల ఆరోగ్య అవసరాల నిమిత్తం 20 పడకల ప్రభుత్వ ఆసుపత్రిని ఏర్పాటు చేయాలని సర్పంచుల ఫోరం అధ్యక్షురాలు కొండ రాజమ్మ, రుద్రారం సర్పంచ్ చంద్రగిరి సంపత్ డిమాండ్ చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కేవలం కాంగ్రెస్ కార్యకర్తలకే జరుగుతోందని దుబ్బపేట సర్పంచ్ ఆరోపించగా, ప్రభుత్వ పథకాలు పూర్తి పారదర్శకంగా అందుతాయని అధికార పార్టీ ప్రజాప్రతినిధులు స్పష్టం చేశారు.అనంతరం వివిధ శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను సభకు సమర్పించారు. ఈ సమావేశంలో డిప్యూటీ తహసీల్దార్ ఇమామ్ బాష, వైద్యాధికారి డాక్టర్ వినయ్ భాస్కర్, మండల వ్యవసాయ అధికారిణి బొల్లపెల్లి శ్రీజ, ఇంచార్జ్ ఎంపీఓ మల్లికార్జున్ రెడ్డి, ఏపీఎం, ఏపీఓ, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు పాల్గొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]