Full width home advertisement

Post Page Advertisement [Top]

రూ. 1.20 లక్షల కోట్ల టర్నోవరే లక్ష్యంగా... 

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద 'బాహుబలి కోల్ మైన్'! 

 సింగరేణి భరోసా యాత్ర కార్నర్ మీటింగ్‌లో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.

మల్హర్ , జూలై 14 (చక్రవాణి న్యూస్) : బిజెపి ఆధ్వర్యంలో జరుగుతున్న సింగరేణి భరోసా యాత్రలో భాగంగా మంగళవారం భూపాలపల్లి జిల్లా మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచర్ల గ్రామంలోని హనుమాన్ సెంటర్లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డి ప్రసంగించారు. 'తాడిచెర్ల కోల్‌బ్లాక్-2'కు త్వరలోనే పూర్తి అనుమతులు లభిస్తాయని ఆయన స్పష్టం చేశారు. దాదాపు 350 మిలియన్ మెట్రిక్ టన్నుల బొగ్గు నిల్వలు ఉన్న ఈ ప్రాజెక్టు ద్వారా 50 ఏళ్ల పాటు నిరంతరాయంగా బొగ్గు ఉత్పత్తి జరగనుంది. దీనివల్ల తెలంగాణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం కావడమే కాకుండా, సుమారు 2000 మందికి ప్రత్యక్షంగా, 5000 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు దక్కుతాయని అన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేసిన తాడిచెర్ల గనుల కేటాయింపును మోడీ ప్రభుత్వం ఒకే ఒక్క చారిత్రాత్మక నిర్ణయంతో సింగరేణికి అప్పగించిందని అన్నారు.ఈ నిర్ణయంతో రాబోయే రోజుల్లో ఈ తాడిచర్ల బ్లాక్ 2 గని మల్హర్ రావు మండలానికే కాకుండా, తెలంగాణ రాష్ట్రానికే ఒక మణికిరీటంగా నిలవనుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. దక్షిణ భారత దేశంలో తాడిచెర్ల కోల్ బ్లాక్ 02 ఒక బాహుబలి మైన్ గా మారనుందన్నారు. ఈ కార్యక్రమంలో మల్కాజ్‌గిరి ఎంపీ ఈటల రాజేందర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, బిజెపి రాష్ట్ర పార్టీ అధ్యక్షులు,బిజెపి శాసనసభా పక్ష లీడర్ ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి, కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి, మాజీ కేంద్ర మంత్రి సీతారాం నాయక్, రాష్ట్ర నాయకులు మంథని నియోజకవర్గ ఇంచార్జీ చంద్రుపట్ల సునీల్ రెడ్డి, రాష్ట్ర నాయకురాలు చంద్రుపట్ల కీర్తి రెడ్డి, రాష్ట్ర నాయకులు చల్లా నారాయణ రెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు సత్యప్రకాష్, అసెంబ్లీ కన్వీనర్ మల్కా మోహన్ రావు, బిజెపి మండల అధ్యక్షులు బండ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.


ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]