తాడిచర్ల డేంజర్ జోన్ భూ సేకరణ విచారణలో పారదర్శకత ఉండాలి: కలెక్టర్ రాహుల్ శర్మ

ఈ నెల 17 నుంచి తాడిచర్ల డేంజర్ జోన్‌లో ఐదు ప్రత్యేక టీములతో ఇళ్ల తనిఖీ

భూపాలపల్లి , జూలై 15 : తాడిచర్ల టిజి జోన్కో ఓసిపి డేంజర్ జోన్ భూ సేకరణ విచారణను పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ ఆదేశించారు. బుధవారం ఐడిఓసి కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ నెల 17 నుంచి డేంజర్ జోన్ పరిధిలోని ప్రతి ఇంటిని తనిఖీ చేసేందుకు 5 ప్రత్యేక టీములను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.నాయబ్ తహసీల్దార్ పర్యవేక్షణలో పనిచేసే ఈ టీములలో గిర్దావర్, పంచాయతీ కార్యదర్శి, వీఆర్వో, జెన్కో ఏఈలు సభ్యులుగా ఉంటారన్నారు. ఎలాంటి ఒత్తిళ్లకు లొంగకుండా, చెక్‌లిస్ట్ ప్రకారం కుటుంబ వివరాలను సమగ్రంగా నమోదు చేయాలని స్పష్టం చేశారు. ప్రతిరోజూ పూర్తి చేసిన నివేదికలను కాటారం ఆర్డీఓ కార్యాలయానికి సమర్పించాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీఓ రవీందర్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments