టెండర్లు లేకుండానే సింగరేణికి తాడిచర్ల గని:
ఎంపీ గడ్డం వంశీకృష్ణ కృషితోనే సింగరేణికి తాడిచర్ల బ్లాక్-2 కేటాయింపు
సింగరేణికి గని కేటాయింపుపై కృతజ్ఞతలు..
స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలి... కాంగ్రెస్ నాయకులు బండి రాజయ్య
మల్హర్, , జూలై 11(చక్రవాణి న్యూస్) : తాడిచర్ల కోల్ బ్లాక్-2 నూతన బొగ్గు గనిని సింగరేణి సంస్థకు కట్టబెట్టేందుకు పార్లమెంటులో ప్రత్యేకంగా కృషి చేసిన పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణకు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, తాడిచర్ల భూ నిర్వాసితుల కమిటీ ఉపాధ్యక్షులు బండి రాజయ్య శనివారం ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేశారు. ఎలాంటి టెండర్లు లేకుండా ఈ బ్లాక్-2ను సింగరేణికి కేటాయించేలా కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డిలతో పాటు ప్రధాని నరేంద్ర మోడీకి పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ అనేకసార్లు వినతులు సమర్పించి విజయం సాధించారని కొనియాడారు.శనివారం తాడిచర్ల బ్లాక్-2 గని సైట్ పరిశీలనకు విచ్చేసిన ఎంపీ గడ్డం వంశీకృష్ణకు బండి రాజయ్య శాలువాతో సత్కరించి ఘన స్వాగతం పలికారు. సైట్ పరిశీలన అనంతరం బంండి రాజయ్య మాట్లాడారు. తాడిచర్ల బ్లాక్-2 పరిధిలో భూములు, ఇళ్లు కోల్పోయిన ప్రతి ఒక్కరికీ న్యాయమైన పరిహారం అందేలా చూడాలని కోరారు. దాంతో పాటు అర్హులైన వారందరికీ ఆర్అండ్ఆర్ (పునరావాస) ప్యాకేజీతో భూమి కోల్పోయిన ప్రతి ఒక్కరికీ ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించి ఆదుకోవాలని ఎంపీకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు శ్రీనివాస్ రెడ్డి, సంజీవరెడ్డి, ఆంజనేయులు, బంండి సుధాకర్ తాండ్ర మార్కు, ప్రభాకర్, రమేష్, రాజయ్య, ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

0 Comments