సింగరేణి పరం కానున్న ‘తాడిచెర్ల-2’ కోల్ బ్లాక్!
కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఎంపీ గడ్డం వంశీకృష్ణ సింగరేణి బలోపేతం..
స్థానిక యువతకు భారీగా పెరగనున్న ఉపాధి అవకాశాలు
మల్హర్, జూలై 9 (చక్రవాణి న్యూస్) : తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు, సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) భవితవ్యాన్ని దృష్టిలో ఉంచుకుని పెద్దపల్లి లోక్‌సభ సభ్యుడు జి. వంశీకృష్ణ గడ్డం చేసిన నిరంతర కృషి ఎట్టకేలకు ఫలించింది. ప్రతిష్టాత్మకమైన తాడిచెర్ల కోల్ బ్లాక్-2ను సింగరేణి సంస్థకే కేటాయించేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది.ఈ కోల్ బ్లాక్ కేటాయింపునకు సంబంధించి ఎంపీ వంశీకృష్ణ గడ్డం 2026 ఫిబ్రవరి 3న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డికి అధికారిక లేఖ రాయడంతో పాటు, పలుమార్లు వ్యక్తిగతంగా కలిసి సింగరేణికి ఈ బ్లాక్ ఎంత అవసరమో వివరించారు. తాడిచెర్ల కోల్ బ్లాక్-2 అనేది వ్యూహాత్మకంగా, ఆర్థికపరంగా రాష్ట్రానికి ఎంతో కీలకమైనదని, దీనివల్ల స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు ప్రాంతీయ అభివృద్ధి, బొగ్గు ఉత్పత్తి, రాష్ట్ర ఆదాయానికి ఎంతో మేలు జరుగుతుందని కేంద్రం దృష్టికి తీసుకెళ్లారు. సింగరేణికి ఉన్న సుదీర్ఘ అనుభవం, పర్యావరణ పరిరక్షణలో ఉన్న గుర్తింపును పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.ఎంపీ విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన కేంద్ర ప్రభుత్వం.. ఈ బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడంతో తెలంగాణ ప్రజలు, సింగరేణి కార్మికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ సందర్భంగా ఎంపీ వంశీకృష్ణ గడ్డం కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ నిర్ణయంతో సింగరేణి మరింత బలోపేతం కావడంతో పాటు ఉత్తర తెలంగాణలో పారిశ్రామికాభివృద్ధికి, రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి కొత్త ఊతం లభిస్తుందని ఆయన పేర్కొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

No comments:
Post a Comment