కాటారం డీఎస్పీ సూర్యనారాయణ హెచ్చరిక
జిల్లా ఎస్పీ శిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ ఆదేశాలతో ముమ్మరంగా కార్డెన్ అండ్ సెర్చ్
మల్హర్, జూలై 9(చక్రవాణి న్యూస్) : గుడుంబా తయారీదారులపై పోలీసులు ఉక్కుపాదం మోపారు. భూపాలపల్లి జిల్లా ఎస్పీ శిరిశెట్టి సంకీర్త్ ఐపీఎస్ ఆదేశాల మేరకు.. గురువారం ఉదయం కొయ్యూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని అడ్వాలపల్లి గ్రామంలో పోలీసులు భారీ ‘కార్డెన్ అండ్ సెర్చ్’ ఆపరేషన్ నిర్వహించారు. కాటారం డీఎస్పీ సూర్యనారాయణ ఆధ్వర్యంలో, కాటారం సీఐ నాగార్జున రావు, కొయ్యూరు ఎస్సై మహేందర్ కుమార్, కాటారం ఎస్సై శ్రీనివాస్ తమ సిబ్బందితో కలిసి అడ్వాలపల్లి గ్రామాన్ని చుట్టుముట్టి ఇళ్లను జల్లెడ పట్టారు.ఈ సందర్భంగా డీఎస్పీ సూర్యనారాయణ గ్రామ ప్రజలతో మాట్లాడుతూ.. అడ్వాలపల్లి గ్రామంలో అధిక మొత్తంలో గుడుంబా తయారీదారులు ఉన్నారని, అట్టి వ్యక్తులను గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అప్పటికైనా వారిలో మార్పు రానట్లయితే, వారికి ప్రభుత్వ పరంగా వచ్చేటటువంటి సంక్షేమ పథకాలన్నింటినీ రద్దు చేసేలా సంబంధిత అధికారులను కోరతామని స్పష్టం చేశారు. అనంతరం కాటారం సీఐ నాగార్జున రావుమాట్లాడుతూ.. ప్రజలందరూ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తగా ఉండాలని, ట్రాఫిక్ రూల్స్ పాటించాలని సూచించారు. చిన్న పిల్లలకు డ్రైవింగ్ కొరకు ఎట్టి పరిస్థితుల్లోనూ వాహనాలు ఇవ్వరాదని తల్లిదండ్రులను కోరారు.ముగ్గురిపై కేసు నమోదు:ఈ ఆపరేషన్‌లో భాగంగా పోలీసులు పలువురి వద్ద నుంచి 38 లీటర్ల గుడుంబాను స్వాధీనం చేసుకున్నారు. అలాగే గుడుంబా తయారీకి సిద్ధంగా ఉంచిన సుమారు 800 లీటర్ల బెల్లం పానకాన్ని అక్కడికక్కడే వంపేసి ధ్వంసం చేశారు. అక్రమంగా గుడుంబా తయారు చేస్తున్న ముగ్గురు వ్యక్తులపై కేసులు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి



0 Comments