గండ్ర సత్యనారాయణ రావు
భూపాలపల్లి, జూలై 10(చక్రవాణి న్యూస్): చిట్యాల మండలం నైన్ పాక, నేరేడుపల్లి గ్రామాల మధ్య బ్రిడ్జి లేకపోవడం వల్ల స్థానిక ప్రజలు పడుతున్న ఇబ్బందులను గమనించి, రూ. 4 కోట్ల అంచనా వ్యయంతో బ్రిడ్జి నిర్మాణ పనులను చేపట్టినట్లు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు తెలిపారు. శుక్రవారం ఆయన ఈ నిర్మాణ పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రస్తుతం కేటాయించిన నిధులు సరిపోకపోతే ఉన్నతాధికారులతో మాట్లాడి మరిన్ని నిధులు మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. పనులు నాణ్యతతో, శాశ్వతంగా ఉండేలా చూస్తామన్నారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో పాటు నైన్ పాక, నేరేడుపల్లి, వజీనాపెళ్లి, గొర్లవీడు, జంగేడు, కొంపెల్లి, కాసింపల్లి గ్రామాల రోడ్లను శాశ్వతంగా డబుల్ రోడ్డుగా మారుస్తామని ప్రకటించారు. దీనివల్ల గిద్ద ముత్తారం, బోర్నపల్లి, వెలిశాల గ్రామాల ప్రజలకు జిల్లా కేంద్రానికి వెళ్లడానికి దూరం తగ్గి, ప్రయాణం సులువవుతుందని పేర్కొన్నారు. బ్రిడ్జి నిర్మాణం త్వరగా పూర్తయ్యేంత వరకు దీనిపై ప్రత్యేక శ్రద్ధ వహిస్తానని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

No comments:
Post a Comment