అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొని మోసపోవద్దు
హెచ్చరించిన పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి
మల్హర్ , జూలై 03: మండల కేంద్రమైన తాడిచెర్ల గ్రామ పంచాయతీ పరిధిలోని కాపురం శివారులో నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా వెలిసిన రియల్ ఎస్టేట్ వెంచర్లలో పంచాయతీ అధికారులు శుక్రవారం బోర్డులను తొలగించారు. ఈ సందర్భంగా తాడిచెర్ల పంచాయతీ కార్యదర్శి మల్లికార్జున్ రెడ్డి మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఎవరైనా సరే ముందస్తు అనుమతులు లేకుండా అక్రమంగా వెంచర్లు ఏర్పాటు చేస్తే చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.అలాగే, ప్రజలు ఎవరూ కూడా ఇటువంటి అక్రమ వెంచర్లలో ప్లాట్లు కొనుగోలు చేసి మోసపోవద్దని పిలుపునిచ్చారు. స్థలాలు లేదా ప్లాట్లు కొనేముందు ముందస్తుగా గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని సందర్శించి, అన్ని రకాల అనుమతులు (పర్మిషన్లు) ఉన్నాయో లేదో సరిచూసుకున్న తర్వాతే కొనుగోలు చేయాలని స్పష్టం చేశారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

No comments:
Post a Comment