కమిషనర్ శివ కుమార్ నాయుడు..
ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటాం.. జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
భూపాలపల్లి, జూలై 03 :
ప్రజా సంక్షేమం దృష్ట్యా ప్రభుత్వం చేపట్టే వివిధ ప్రాజెక్టులకు సంబంధించిన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ (పునరావాస, పునర్నిర్మాణ) ప్యాకేజీల అమలు ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆర్ అండ్ ఆర్ కమిషనర్ శివ కుమార్ నాయుడు అధికారులను ఆదేశించారు. శుక్రవారం నాడు భూపాలపల్లి జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు, జెన్కో, సింగరేణి సంస్థలకు జరుగుతున్న భూసేకరణ ప్రక్రియపై జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మతో కలిసి రెవెన్యూ, సర్వే, సింగరేణి, జెన్కో అధికారులతో ఆయన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, నిర్వాసితులకు అందాల్సిన పునరావాస ప్యాకేజీలను ఎలాంటి ఆలస్యం లేకుండా, నిబంధనల ప్రకారం పూర్తి పారదర్శకతతో అందించాలని స్పష్టం చేశారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి ఆటంకాలు లేకుండా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. భూసేకరణకు సంబంధించిన అభ్యంతరాలు, ఫిర్యాదులను తక్షణమే పరిష్కరించాలని, వివిధ శాఖల మధ్య సమన్వయం పెంపొందిస్తూ పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు.జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ మాట్లాడుతూ, జిల్లాలో అమలవుతున్న వివిధ ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, ఆర్ అండ్ ఆర్ ప్యాకేజీలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఎటువంటి ఫిర్యాదులకు తావులేకుండా అన్ని శాఖల అధికారులు పరస్పర సమన్వయంతో పనిచేయాలని, సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించాలని స్పష్టం చేశారు. భూసేకరణ పూర్తయిన వెంటనే ఆ భూములను ఇరిగేషన్ శాఖకు అప్పగించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ సమావేశంలో భూపాలపల్లి, కాటారం ఆర్డీఓలు హరికృష్ణ, రవీందర్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీ కుసుమ కుమారి, జెన్కో సీఈ శ్రీ ప్రకాష్, సింగరేణి జీఎం రాజేశ్వర్ రెడ్డి, మరియు అన్ని మండలాల తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

0 Comments