Full width home advertisement

Post Page Advertisement [Top]

 
ఈదుమూడిలో ‘మాదిగల పుణ్యక్షేత్రం’ శంకుస్థాపన

  • నేడు వాల్ పోస్టర్‌ ఆవిష్కరించిన ఎమ్మార్పీఎస్ నాయకులు
  • భారీగా తరలిరావాలని పిలుపు

మల్హర్ , జూలై 03: ఎమ్మార్పీఎస్ 32వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని, ఈ నెల 7వ తేదీన ఉదయం 10 గంటలకు ఈదుమూడి గ్రామంలో ‘మాదిగల పుణ్యక్షేత్రం’ శంకుస్థాపన మహోత్సవాన్ని నిర్వహించనున్నారు. మల్హర్‌ రావు మండల కేంద్రమైన తాడిచర్లలో దీనికి సంబంధించిన వాల్ పోస్టర్‌ను ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి కలగూర తిరుపతి మాదిగ, జయశంకర్ భూపాలపల్లి జిల్లా అధ్యక్షులు బూడిద సమ్మయ్య ఆధ్వర్యంలో నాయకులు ఘనంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ ముఖ్య అతిథిగా హాజరై ఈ పుణ్యక్షేత్ర శంకుస్థాపన చేయనున్నట్లు తెలిపారు. మాదిగ జాతి ఆత్మగౌరవ ప్రతీకగా నిలిచే "మాదిగ అమరవీరుల స్తూపం" ఇక్కడ ప్రతిష్టించనున్నట్లు వివరించారు. ఈ చారిత్రాత్మక మహోత్సవానికి ఉమ్మడి జిల్లా నలుమూలల నుంచి ఎమ్మార్పీఎస్ నాయకులు, కార్యకర్తలు, మాదిగ మహాజనులు భారీ సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇందారపు సమ్మయ్య, ఇందారపు మొగిలి, కోలుగురి రాజేష్, కేసారపు సురేందర్, బూడిద సాగర్, బూడిద రాజసమ్మయ్య, గుగ్గిళ్ల రాజకుమార్, కోలుగురి సమ్మయ్య, ఇందారపు కుమార్, ఇందారపు రమేష్, మరపాక దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.


ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]