Full width home advertisement

Post Page Advertisement [Top]

 భూపాలపల్లి జిల్లాలో DM&HO డాక్టర్ మధుసూదన్ ఆకస్మిక తనిఖీలు.. 


నిబంధనలు అతిక్రమించే ప్రైవేట్ ఆసుపత్రులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని భూపాలపల్లి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి (DM&HO) డాక్టర్ మధుసూదన్ హెచ్చరించారు. గురువారం జిల్లా కేంద్రంలోని మేధ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, సాయి రత్న హాస్పిటల్‌లలో ఆయన ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.ఈ తనిఖీల్లో భాగంగా ఆసుపత్రులలో ఫైర్ సేఫ్టీ అనుమతులు, కాలుష్య నియంత్రణ బోర్డు (PCB) ధృవపత్రాలు, బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అలాగే రోగులకు అందుబాటులో ఉండాల్సిన వైద్య సేవల ధరల పట్టికలను, ఇతర చట్టబద్ధ పత్రాలను తనిఖీ చేశారు.ఈ సందర్భంగా డాక్టర్ మధుసూదన్ మాట్లాడుతూ.. ఆసుపత్రి యాజమాన్యాలు నిబంధనల ప్రకారం అన్ని ధృవపత్రాలను ఎప్పటికప్పుడు నవీకరించుకోవాలని (Renew) సూచించారు. రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, అనవసర సిజేరియన్లు తగ్గించి నార్మల్ డెలివరీలకే ప్రాధాన్యత ఇవ్వాలని స్పష్టం చేశారు. అనంతరం ఆసుపత్రిలోని అల్ట్రాసౌండ్ మిషన్లను, కేస్ షీట్లను, రికార్డులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ తనిఖీ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ శ్రీదేవి, ఇన్చార్జి డెమో శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు.

చక్రవాణి న్యూస్

ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం... అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!

#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]