అంబేడ్కర్ చిత్రపటాన్ని ట్రాక్టర్ తో తొక్కించడాన్ని తీవ్రంగా ఖండించిన మంత్రి రాజబాపు


జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఘనపూర్ మండలం, గాంధీనగర్ కూడలి హైవే పైన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ చిత్రపటాన్ని ట్రాక్టర్ తో తొక్కించడాన్ని 'టి ఆర్ మానవ హక్కులు మరియు అవినీతి నిరోధక సంస్థ' (TR Human Rights & Anti Corruption Association) జిల్లా చైర్మన్ మంత్రి రాజబాపు తీవ్రంగా ఖండించారు. గురువారం భూపాలపల్లి జిల్లాలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి రాజబాపు మాట్లాడుతూ.. ఘనపూర్ మండలం, గాంధీనగర్ కూడలిలో డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం కోసం ఆ స్థలంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు ప్రజలందరూ కలిసి ఒక చిత్రపటాన్ని ఏర్పాటు చేసుకున్నారని తెలిపారు. ప్రపంచ ప్రజ్ఞాశీలి, భారత రాజ్యాంగ నిర్మాత, దేశంలోని ప్రజలందరికీ మానవ హక్కులు కల్పించిన అతిరథ మహావీరుడు, భారతదేశంలోని 90% జనాభాకు ఆరాధ్య దైవమైన డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గారి చిత్రపటాన్ని ట్రాక్టర్ తో తొక్కించడం అత్యంత ఘోరమైన విషయమన్నారు.ఈ దుశ్చర్యకు పాల్పడిన వ్యక్తి పై తక్షణమే చర్యలు తీసుకుని ఈ సంఘటన పై పూర్తి స్థాయి విచారణ జరిపి సంఘటన వెనుక ఉన్న దోషుల పై కేసులు నమోదు చేసి శిక్షించాలని కోరారు. వారి వెంట హ్యూమన్ రైట్స్ సభ్యులు ఉన్నారు. 

చక్రవాణి న్యూస్

ప్రజా పక్షం - అవినీతిపై సమరం

"చీకటిని చీల్చే సూర్యకిరణం... అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం... మీ చక్రవాణి న్యూస్!"

అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!

#ChakravaniNews | #అవినీతిపై_సుదర్శన_చక్రం | #అన్యాయంపై_విష్ణుచక్రం | #నిజం_వైపు_చక్రవాణి

Post a Comment

0 Comments