Full width home advertisement

Post Page Advertisement [Top]


పాము కాటు బాధితుడికి పరామర్శ.. రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచన
మల్హర్ , జూలై 31(చక్రవాణి న్యూస్) : మల్హర్ రావు మండల కేంద్రమైన తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని (పీహెచ్‌సీ) శుక్రవారం తాడిచర్ల ఫాక్స్ చైర్మన్ ఇప్ప మొండయ్య సందర్శించారు. ఈ సందర్భంగా పాము కాటుకు గురై పీహెచ్‌సీలో చికిత్స పొందుతున్న పెద్దతూండ్ల గ్రామానికి చెందిన తాళ్ల రాజిరెడ్డిని ఆయన పరామర్శించి, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.ఇటీవల పాముకాటుకు గురై ఒక విద్యార్థి మృతి చెందిన ఘటనపై స్పందిస్తూ.. ఆ సమయంలో అందించిన ప్రథమ చికిత్స వివరాలను వైద్యాధికారి డాక్టర్ వినయ్ భాస్కర్ ను అడిగి తెలుసుకున్నారు. వర్షాకాలం దృష్ట్యా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చూడాలని, పాము, తేలు తదితర విష కీటకాలు కుట్టినప్పుడు అవసరమయ్యే అత్యవసర మందులను పీహెచ్‌సీలో ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలని అధికారులకు సూచించారు. గ్రామాల్లో ప్రత్యేక మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి, సీజనల్ వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు జక్కుల వెంకటస్వామి యాదవ్ తదితరులు పాల్గొన్నారు.

ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews #అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:

No comments:

Post a Comment

Bottom Ad [Post Page]