మహిళలు తప్పనిసరిగా సర్వైకల్ క్యాన్సర్ పరీక్షలు చేయించుకోవాలి: మంత్రి పిలుపు
భూపాలపల్లి , జూలై 31(చక్రవాణి న్యూస్) :
శిథిలావస్థలో ఉన్న మహదేవపూర్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని ఆధునిక వసతులతో పునర్నిర్మించి ప్రజలకు మెరుగైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తెలిపారు. మారుమూల ప్రాంత ప్రజలకు నగర స్థాయి వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.మహదేవపూర్ ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిలో ఐడీబీఐ బ్యాంకు సహకారంతో ఎంఎన్జే క్యాన్సర్ ఆసుపత్రి, ఒమేగా ఆసుపత్రి వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత క్యాన్సర్, కంటి నిర్ధారణ వైద్య శిబిరాన్ని శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు ప్రారంభించారు. అనంతరం ఆసుపత్రిలోని హెల్త్ ఏటీఎం, ఈసీజీ, కంటి పరీక్షల పరికరాలను పరిశీలించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. మహిళలు తప్పనిసరిగా గర్భాశయ క్యాన్సర్ (సర్వైకల్ క్యాన్సర్) పరీక్షలు చేయించుకోవాలని, వ్యాధిని ప్రారంభ దశలో గుర్తిస్తే చికిత్స సులభమవుతుందని సూచించారు. హెల్త్ ఏటీఎం ద్వారా 64 రకాల పరీక్షలు నిర్వహించి, వాటి వివరాలను ఐదేళ్లపాటు భద్రపరిచే హెల్త్ కార్డులను ప్రజలకు అందజేస్తామని తెలిపారు. ఆగస్టు 4న ఎంఎన్జే ఆసుపత్రి ఆధ్వర్యంలో మరో ఉచిత ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. కాటారం డివిజన్లో ఇప్పటికే 680 మందికి ఉచిత కంటి శస్త్రచికిత్సలు నిర్వహించామని, మంథని నియోజకవర్గంలో సుమారు 45 వేల మందికి కంటి వైద్య సేవలు అందించినట్లు వివరించారు. ఇదే వేదికపై వైద్య సేవలు అందించిన వైద్యులను మంత్రి ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ట్రేడ్ ప్రమోషన్ చైర్మన్ అయిత ప్రకాష్ రెడ్డి, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ మధుసూదన్, ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ శ్రీకాంత్, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రాజాబాబు, విబిజి రాంజీ, రాష్ట్ర సభ్యులు దండు రమేష్, కాటారం ఆర్డీఓ రవీందర్, శిక్షణా డిప్యూటీ కలెక్టర్ నవీన్ రెడ్డి, తహసీల్దార్ సత్యనారాయణ స్వామి, ఎంపీడీఓ రవీంద్ర నాథ్, ఆంకాలజిస్టు డాక్టర్ సంతోష్ రెడ్డి, వైద్యులు, సర్పంచ్ హసీనా భాను అక్బర్, కాటారం మార్కెట్ కమిటీ చైర్మన్ పంతకాని తిరుమల సమ్మయ్య, పీఏసీఎస్ చైర్మన్ తిరుపతి రెడ్డి, ఐడీబీఐ మేనేజర్ చంద్రమౌళీశ్వర రెడ్డి, కాలేశ్వరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
ప్రజా పక్షం - అవినీతిపై సమరం
"చీకటిని చీల్చే సూర్యకిరణం...
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయాన్ని అంతం చేసే విష్ణుచక్రం...
మీ చక్రవాణి న్యూస్!"
అన్యాయంపై అక్షర సమరం.. అవినీతిపై సుదర్శన చక్రం!
#ChakravaniNews
#అవినీతిపై_సుదర్శన_చక్రం
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
#అన్యాయంపై_విష్ణుచక్రం #నిజం_వైపు_చక్రవాణి
మా సోషల్ మీడియా ఖాతాలను ఫాలో అవ్వండి:



0 Comments